Jukkal: కామారెడ్డి రాజకీయ వేదికపై జుక్కల్ ఎమ్మెల్యే హాట్ టాపిక్!

Jukkal: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాజకీయ ప్రస్థానం, ఇసుక వివాదంపై ఆయన స్పష్టమైన వైఖరి.

VEERANNA, JUKKAL
Published on: 26 May 2026 9:12 PM IST
Jukkal
X

Jukkal: కామారెడ్డి రాజకీయ వేదికపై జుక్కల్ ఎమ్మెల్యే హాట్ టాపిక్!

జుక్కల్ (కామారెడ్డి): ప్రజా సమస్యల పై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు స్పష్టమైన వైఖరి, నాయకత్వం, ప్రజలతో మమేకం అయ్యే తీరు ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి జుక్కల్ ఎమ్మెల్యే పై పడింది. ఇటీవల బాన్సువాడ వేదికగా జుక్కల్ నియోజకవర్గం లొ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కావలసిన ఇసుక విషయంలో అధికారులు, పోలీసులు వింతగా ప్రవర్తిస్తున్నారని వేదిక సాక్షిగా తన ఆవేదన వెలిబుచ్చారు. ఇసుక వివాదం పై స్పందించిన ఎమ్మెల్యే తోట తను ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాక గతంలో ఎన్నడు లేని విధంగా నియోజకవర్గం లొ అక్రమ ఇసుక రవాణాపై మొట్టమొదటి సారిగా ఉక్కుపాదం మోపనని అలాంటిది ఇప్పుడు నిజమైన అర్హులై ఉండి ఇసుక అవసరమైన లబ్ధిదారులకు పోలీసులు ఇబ్బందులు పెట్టిదన్నదే తన అభిప్రాయమని పోలీసుల పై తనకు అపార మైన గౌరవం ఉందని ఈ మధ్యలో కావాలని కొందరు అధికారులు టార్గెట్ చేసి వ్యవహరిస్తున్నారని దాని కారణంగానే ప్రజలు నిన్న ఆక్రోశం తో పోలీసులతో ఘర్షణ పడ్డారన్నారు.

దీంతోపాటు కామారెడ్డి వేదికగా జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ విషయం పై ఆరా తీసేందుకు మీడియా ప్రతినిధులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ను చుట్టుముట్టి ప్రత్యేక ఇంటర్యూ కోసం ఆసక్తి చూపడం ఆయనపై పెరుగుతున్న ప్రజాదరణ కు నిదర్శనం. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో రాజకీయ చర్చలన్నీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు చుట్టూనే తిరుగుతున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్యూ లో ఎమ్మెల్యే తన ఎస్కార్ట్ ఎందుకు తగ్గించారో తనకు తెలియదని అయిన తను నిరంతరం ప్రజల్లో ఉండే మనిషని తనకు ఇప్పుడున్న గన్ మెన్ లను తొలగించిన తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అధికారులు తమ తీరు మార్చుకోకపోతే ప్రజల నుండి ప్రతి ఘటన తప్పదన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story