Banswada: బాన్సువాడలో తీవ్రమైన కోతులు, కుక్కల బెడద!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కోతులు, కుక్కల బెడద తీవ్రమైంది. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్న వాటిని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
Banswada: బాన్సువాడలో తీవ్రమైన కోతులు, కుక్కల బెడద!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో కోతులు,కుక్కల బెడద తీవ్రం అయ్యింది.పట్టణంలో కుక్కలు,కోతులు గుంపులు,గుంపులుగా తిరుగుతూ, స్వైర విహారం చేస్తున్నాయి.ప్రతీ రోజు చిన్నారులపై, పెద్దల పై దాడులు చేస్తున్నాయి.పట్టణ ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు.కోతులు ఇండ్లల్లో చొరబడి,తినుబండారాలు ఎత్తుకుపోతున్నాయని,రోజు, రోజుకు వాటి సంఖ్య బాగా పెరిగిపోతోంది అని అంటున్నారు.
ప్రతీ రోజు కుక్క కాటుకు గురైన వారు,కోతులు గాయ పరిచిన వారు వస్తున్నారని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.వాటి నివారణ కు చర్యలు తీసుకుని,వాటి బారి నుండి ప్రజలను రక్షించాలని ,అధికారులకు పట్టణ వాసులు కోరుతున్నారు.




