Mopal: మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

Mopal: మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్సై సుష్మిత. పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది.

M. RAMESH,NIZAMABAD
Published on: 15 Aug 2026 9:46 PM IST
Mopal
X

Mopal: మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

మోపాల్: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మోపాల్ పోలీస్ స్టేషన్ లో ఎస్. ఐ సుష్మిత జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి, జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేసి మిఠాయిలు పంచారు.

ఈ సందర్బంగా ఎస్. ఐ సుష్మిత మాట్లాడుతు ఈనాటి స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఎందరో మహానుభావుల త్యాగఫలమని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆదర్శాలను, వారు చూపిన శాంతియుత మార్గాన్ని అనుసరించి పౌరులు నడుచుకోవాలని కోరారు.నేర రహిత, శాంతియుత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

శాంతిభద్రతల రక్షణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల దర్యాప్తు జరుగుతోందని, నేర నియంత్రణ కోసం రాత్రింబవళ్ళు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజలకు, బాధితులకు వేగవంతంగా పోలీసు సేవలు అందిస్తున్నామని, ఆపద సమయంలో ఎప్పుడైనా డయల్ 112 ద్వారా పోలీసు సహాయం తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story