Menoor: అయ్యప్ప స్వాముల సేవలో ఎంఆర్పీఎస్ నేత సూర్యావంశీ యాదవ్!
Menoor: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూర్ అయ్యప్ప సన్నిధానంలో ఎంఆర్పీఎస్ నేత సూర్యావంశీ యాదవ్ గురువారం అయ్యప్ప స్వాములకు అన్నదానం నిర్వహించారు.
Menoor: అయ్యప్ప స్వాముల సేవలో ఎంఆర్పీఎస్ నేత సూర్యావంశీ యాదవ్!
మెనూర్ (కామారెడ్డి): అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప భక్తులకు ఎం ఆర్ పి ఎస్ జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు సూర్యావంశీ యాదవ్ ఆధ్వర్యంలో స్వాములకు అన్నదానం నిర్వహించారు. మద్నూర్ మండలం మెనూర్ గ్రామ శివారులోని అయ్యప్ప సన్నిధానంలో భక్తి శ్రద్దలతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కఠోర దీక్ష లో మాలలో ఉన్న స్వాములకు స్వామి ఆశీర్వధించాలని వేడుకున్నారు.
భక్తి పారవశ్యంలో మునిగి తెలుతున్న మాల ధారణ స్వాములు అయ్యప్ప స్వామి సేవలో అన్నదానం నిర్వహిస్తు అధ్యాత్మికతకు సేవభావన్నీ జోడించారు. అయ్యప్ప దీక్ష స్వాములు మాల ధరించడం నియమం, నిష్ఠ, క్రమశిక్షణ, భక్తి, సేవభావం కలగలిసిన ఆధ్యాత్మిక ప్రయాణమని మండల దీక్షలో ఇరుముడి ధరించి శబరిమల యాత్ర కు సిద్దమయ్యే స్వాములకు హరిహర సుతుడు అయ్యప్ప స్వామిని స్మరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారని యాదవ్ అన్నారు.
ఈ అన్నదాన కార్యక్రమం తో అయ్యప్ప స్వాముల మధ్య భక్తి భావం, సేవ భావం వెళ్లివేరిసింది.కార్యక్రమం లో గురు స్వాములు రామ్ మోహన్ రాజు, రఘు స్వామి, గాయాక్వాడ్ విజయ్, చౌల హన్మాండ్లు గురు స్వామిలకు శాలువాలు కప్పి స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అన్నదానం నిర్వహించిన సూర్యావంశీకి అయ్యప్ప సన్నిధాన స్వాముల ఆధ్వర్యంలో జ్ఞాపికను అందజేసి సన్మానించారు.




