Bodhan: పాత బస్టాండ్ కూడలిలో తోపుడుబండ్లు, తాత్కాలిక షెడ్ల తొలగింపు!

Bodhan: పాత బస్టాండ్, ప్రధాన కూడళ్లలో రోడ్లపై అక్రమంగా కొనసాగిస్తున్న పండ్ల వ్యాపారాలు, తోపుడుబండ్లు, తాత్కాలిక షెడ్లను మున్సిపల్, పోలీస్ అధికారులు సంయుక్తంగా తొలగించారు.

K RAVI, BODHAN
Published on: 16 July 2026 10:41 PM IST
Bodhan
X

Bodhan: పాత బస్టాండ్ కూడలిలో తోపుడుబండ్లు, తాత్కాలిక షెడ్ల తొలగింపు!

బోధన్: బోధన్ పట్టణంలోని పాత బస్టాండ్ తో ఆటో ప్రధాన కూడల్లో అక్రమంగా రోడ్లపై కొనసాగిస్తున్న పండ్ల వ్యాపారాలను బోధన్ మున్సిపల్ శాఖ తోపాటు పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ సంయుక్తంగా తొలగించారు. ప్రధాన కూడల్లో రోడ్లపై తోపుడుబండ్లను పెట్టుకుని పండ్ల వ్యాపారం, మిర్చి బండ్లను నిర్వహిస్తున్న చి రువా వ్యాపారస్తులపై చర్యలు చేపట్టారు.

ఈ వ్యాపారాల మూలంగా వాహనదారులకు తీవ్ర తీవ్ర ఇబ్బందులు కలగ డం తో పాటు పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ ఉక్కు పాదం మోపారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణతో కలిసి అక్రమ వ్యాపారస్తులను మున్సిపల్ స్థలాలతోపాటు రోడ్లపై ఉన్న తాత్కాలిక షెడ్లు, ఇతర వ్యాపారస్తులను తొలగింపజేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ హెచ్చరించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story