Banswada: పట్టణంలో భారీ వర్షాల అలర్ట్.. రంగంలోకి దిగిన మున్సిపల్ కమీషనర్

Banswada: బాన్సువాడ మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.

SALEEM, BANSWADA
Published on: 29 July 2026 6:49 PM IST
Banswada
X

Banswada: పట్టణంలో భారీ వర్షాల అలర్ట్.. రంగంలోకి దిగిన మున్సిపల్ కమీషనర్

బాన్సువాడ: బాన్సువాడ పట్టణ పరిధిలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా పురపాలక సంఘం బాన్సువాడ కమీషనర్ శ్రీ గోపు గంగాధర్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా శిథిలావస్థలో ఉండి కూలిపోయే ప్రమాదం ఉన్న ఇండ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలు వర్షాలు పూర్తిగా తగ్గే వరకు సురక్షితమైన ఇతర ప్రాంతాలకు లేదా బంధువుల ఇళ్లకు తాత్కాలికంగా తరలివెళ్లవలసిందిగా సూచించడం జరిగింది.

ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని ముందస్తు చర్యలు మున్సిపాలిటీ చేపడుతోంది. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే మున్సిపల్ అధికారులు సమాచారం అందించి సహాయం పొందాలని కోరడమైనది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి తమ కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవాలని ఆయన కోరడం జరిగినది. కమీషనర్ వెంట కార్యాలయ సిబ్బంది మరియు ఆయా వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story