Nasrullabad: మైలారం శివారులో ద్విచక్ర వాహనం దగ్ధం.. యువకుడికి గాయాలు

Nasrullabad: నస్రుల్లాబాద్ మండలం మైలారం శివారులో బైక్ అదుపుతప్పి దగ్ధం; తిమ్మాపూర్ యువకుడు చైతన్యకు గాయాలు, నిజామాబాద్ ఆసుపత్రికి తరలింపు.

SALEEM, BANSWADA
Published on: 24 Nov 2026 10:37 PM IST
Nasrullabad
X

Nasrullabad: మైలారం శివారులో ద్విచక్ర వాహనం దగ్ధం.. యువకుడికి గాయాలు

నసురుల్లాబాద్: నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి దగ్ధమైన ఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం, బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చైతన్య అనే యువకుడు హైదరాబాద్ నుంచి రెండు రోజుల కిందట స్వగ్రామానికి వచ్చాడు.

సోమవారం రాత్రి నస్రుల్లాబాద్ నుంచి తిరిగి ద్విచక్ర వాహనంపై తిమ్మాపూర్ గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మైలారం శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో పెట్రోల్ ట్యాంక్ ధ్వంసమైంది. రోడ్డుపై ద్విచక్ర వాహనం పడటంతో నిప్పులు చెలరేగి పెట్రోల్ ట్యాంకుకు అంటుకోవడంతో బుల్లెట్ వాహనం పూర్తిగా కాలిపోయింది. చైతన్యకు గాయాలు కావడంతో హుటాహుటిన నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA