Nandipet: 'సర్పంచ్ అంటే ఇలా ఉండాలి'.. గ్రామస్తుల ప్రశంసలు
Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ గ్రామ సర్పంచ్ మీసాల సిద్దాపురం లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రూ. 6 లక్షలతో డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
Nandipet: 'సర్పంచ్ అంటే ఇలా ఉండాలి'.. గ్రామస్తుల ప్రశంసలు
Nandipet: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఐలాపూర్ గ్రామ సర్పంచ్ మీసాల సిద్దాపురం లక్ష్మీనారాయణ అభివృద్ధిలో మరో ముందడుగు వేశారు. తాను సర్పంచ్ గా గెలిచిన మొదటి రోజు నుంచి తనను గెలిపించిన గ్రామ అబివృద్దికి కోసం పాటు పడుతున్న మీసాల లక్ష్మీ నారాయణ 6 లక్ష రూపాయల తో గ్రామం లో డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. అంతటితో ఆగకుండా గ్రామం లో వి వో బిల్డింగ్ ను ( మహిళ భవనం) మంజూరు చేయించారు.
మరో వైపు మండల లో ఎక్కడ లేని విధంగా రెండు అంగన్ వాడి బిల్డింగ్ లను మంజూరు చేయించటం తో పాటు వాటికి భూమి పూజ చేశారు. గ్రామంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ అంటే లక్ష్మీనారాయణ లాగా ఉండాలని ఇలాంటి సర్పంచు గ్రామంలో ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందనీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఈ కార్యక్రమం లో సొసైటీ చైర్మెన్ మీసాల సుదర్శన్, పోగుల గంగాధర్, ఎర్రటి రాజు,
వర్డ్ మెంబర్స్ మేకల సురేష్, చెంచుల గురవయ్య, ఎర్రటి చిరంజీవి, దినేష్ ఎర్రటి రాజు, నర్సయ్య, నర్సగౌడ్, తదితరులు పాల్గొన్నారు.




