Dharpally: ధర్పల్లి నూతన ఎస్.ఐ గా జి. సందీప్ బాధ్యతల స్వీకరణ!
Dharpally: పోలీస్ బదిలీల్లో భాగంగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ నుంచి ధర్పల్లికి బదిలీపై వచ్చిన ఎస్.ఐ జి. సందీప్ శనివారం నూతన ఎస్‌హెచ్‌ఓ (SHO)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Dharpally: ధర్పల్లి నూతన ఎస్.ఐ గా జి. సందీప్ బాధ్యతల స్వీకరణ!
ధర్పల్లి: ఇటీవల జరిగిన పోలీసు శాఖ బదిలీలలో భాగంగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఎస్.హెచ్.ఓ గా విధులు నిర్వహించిన ఎస్.ఐ జి. సందీప్ ధర్పల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు.
ఈ రోజు ఆయన ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్.హెచ్.ఓ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ జి. సందీప్ మాట్లాడుతూ, మండల ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ స్టేషన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎస్. ఐ సందీప్ తెలిపారు.
Next Story




