Nandipet: మాయాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ
Nandipet: నందిపేట్ మండలం మాయాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ జరిగింది.
Nandipet: మాయాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ
నందిపేట్: జిల్లా కేంద్రం నందిపేట్ మండల్ మాయాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.
సర్పంచ్ ఎలక్షన్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న గ్రామ సర్పంచ్:
గ్రామ సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామానికి నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సర్పంచ్ శ్రీ బ్యాగరి జీవన్ ఈ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. గ్రామ ప్రజలు సర్పంచ్ ఈ కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ బ్యాగరి జీవన్, ఉప సర్పంచ్ శ్రీ కడారి విష్ణువర్ధన్, డి.ఈ. శ్రీ కిషన్ నాయక్, ఏ.ఈ. శ్రీ రాజ్‌కుమార్, గ్రామ కార్యదర్శి శ్రీ వెంకటేష్ పాల్గొన్నారు.
అలాగే వార్డు సభ్యులు శ్రీ గంగాధర్, శ్రీ మల్లేష్, శ్రీ వినోద్, శ్రీమతి భోజమ్మ, శ్రీమతి రుకుంబాయి, వి.డి.సి సభ్యులు శ్రీ ముత్తన్న, శ్రీ మల్లేష్ గారు మరియు గ్రామ సంఘాల మహిళలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి గ్రామపంచాయతీ భవనం ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇది దోహదపడుతుందని సర్పంచ్ శ్రీ బ్యాగరి జీవన్ తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.




