Nirmal: జ్యోతిబాపూలే హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

Nirmal: నిర్మల్ జ్యోతిబాపూలే హాస్టల్‌లో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ. వసతులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 22 July 2026 9:23 PM IST
Nirmal
X

Nirmal: జ్యోతిబాపూలే హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ లో గల మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ ను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీసి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఓకే గదిలో 25 నుంచి 40 మంది విద్యార్థులను ఉంచుతూ అరకోర వసతులను కల్పించడం చాలా బాధాకరమన్నారు. గత ప్రభుత్వం నుంచి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో సైతం హాస్టల్స్ లో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం శోచనీయమన్నారు.

ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో టాయిలెట్స్ రూమ్స్ సరిగా లేనందువలన విద్యార్థులకు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ తో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story