Nizamabad: అంగన్వాడి కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లి అంగన్వాడి కేంద్రంలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన అంగన్వాడీ టీచర్ సురేఖ.

M. RAMESH,NIZAMABAD
Published on: 15 Aug 2026 5:38 PM IST
Nizamabad
X

Nizamabad: అంగన్వాడి కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

నిజామాబాద్: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖిల్లా డిచ్ పల్లి గ్రామం అంగన్వాడి కేంద్రం లో ఘనంగా జాతీయ జెండా ను అంగన్వాడీ టీచర్ సురేఖ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.

దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాసేవ అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను కొనసాగిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో అంగన్వాడి టీచర్ సురేఖ, అనిత, ఆయమ్మ స్రవంతి, అంగన్వాడి సిబ్బంది, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story