Rudrur: సర్పంచ్ గంగాధర్: ప్లాస్టిక్ నిషేధించాలి!

Rudrur: రుద్రూర్ మండలం అంబం గ్రామంలో ప్లాస్టిక్ నివారణ, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించి, వ్యాపారులకు వినతిపత్రాలు అందజేశారు.

SALEEM, BANSWADA
Published on: 7 Oct 2026 8:38 PM IST
Rudrur
X

Rudrur: సర్పంచ్ గంగాధర్: ప్లాస్టిక్ నిషేధించాలి!

Rudrur: రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ వారు ప్లాస్టిక్ రహిత గ్రామం గా తీర్చిదిద్దటానికి చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్ నిర్మూలనకొరకు గ్రామపంచాయతీ నుండి గ్రామంలోని అన్ని కిరణా షాపులు, హోటల్లు, కల్లు దుకాణాలు, చికెన్ షాప్ యజమానులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం యుపిఎస్ పాఠశాల విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు.

ప్లాస్టిక్ నివారణ గురించి, మత్తు పదార్థాల వినియోగంతో అనారోగ్య సమస్యల పై అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుర్లెపు గంగాధర్ మాట్లాడుతూ. పర్యావరణంతో పాటు ప్రజలకు, మూగజీవాలకు ప్లాస్టిక్ కవర్లతో ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. కావున ప్లాస్టిక్ కవర్లను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి పై ఉందనిఈ సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు బడే రాము, క్యాషియర్ సగరల్లి పండరి, వార్డు సభ్యులు రామసాని సాయిలు, సుంచు జోష్ణ, గ్రామపంచాయతీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA