Dichpally: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మండిపాటు
Dichpally: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ డిచ్‌పల్లిలో బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
Dichpally: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ మండిపాటు
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం కేంద్రం లోడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు ర్యాలీగా తరలివెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులు.ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
“అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది. .రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ వద్ద బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై ప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరును ఖండిస్తూ మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రౌడీ పరిపాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరను దుయ్యబట్టారు... మహిళా ఎమ్మెల్యేల దాడులతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామని హెచ్చరించారు.హక్కులను కాపాడటం కోసం ప్రజల గొంతుకగా బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ నాయకత్వంలో సాగిన ఉద్యమాన్ని, రాష్ట్ర సాధన అనంతరం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదు” అని అన్నారు.
“కేసీఆర్ సర్కారు హయాంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలు, యువత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్తాం” అని నిజామాబాద్ రూరల్ బిఆర్ఎస్ ఇంచార్జి బాజిరెడ్డి జగన్ అన్నారు.
రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రచారానికే పరిమితమవుతోందని ఆరోపించారు.
“ప్రజల సమస్యలపై మౌనం వహించే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తాం. అవసరమైతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ముందుండి పోరాడుతుంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం” అని బాజిరెడ్డి జగన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం బి ఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




