Varni: కూనీపూర్ గ్రామంలో భూ భారతి రీ-సర్వే ప్రారంభం

Varni: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ భూ భారతి రీ-సర్వే ప్రారంభం. పారదర్శకంగా భూ సర్వే జరపాలని అధికారుల స్పష్టీకరణ.

SALEEM, BANSWADA
Published on: 4 Nov 2026 6:32 PM IST
Varni
X

Varni: కూనీపూర్ గ్రామంలో భూ భారతి రీ-సర్వే ప్రారంభం

వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలo కూనీపూర్ గ్రామంలో భూ భారతి భూముల సర్వే ప్రారంబించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి ,రైతుల భూముల పరిరక్షణ,ప్రభుత్వ భూముల పరిరక్షణ కొరకు చేపట్టిన చర్యల్లో భాగంగా భూముల రీ సర్వే చేయిస్తున్నారు.

ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా,పకడ్బందీ గా ఈ సర్వే చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఖూనీపూర్ గ్రామ సర్పంచ్ బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ , సర్వేర్ డి చంద్రయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ భీమేష్ తో పాటు మాజీ సొసైటీ చైర్మన్ గోపాల్ రెడ్డి , కాంతారావు , రెడ్డి వినోద్ శివకుమార్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA