Nizamabad: డిచ్‌పల్లిలో ఎండిన పంటలు: అన్నదాతల పరామర్శించిన దినేష్

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో కరెంట్ కోతలు, వర్షాభావంతో ఎండిపోతున్న వరి పొలాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 8 Oct 2026 4:19 PM IST
Nizamabad
X

Nizamabad: డిచ్‌పల్లిలో ఎండిన పంటలు: అన్నదాతల పరామర్శించిన దినేష్

నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులతో వరి పంటలు పొట్ట దశలోనే ఎండిపోతున్నాయి. దీంతో ఆందోళనలో ఉన్న రైతులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పంట పొలాలను పరిశీలించారు..రైతులు తమ గోడును ఆయనకు వినిపించారు.

సరైన సమయంలో వర్షాలు లేకపోవడం, విద్యుత్ కోతలతో బోర్ల కింద కూడా పంటలకు నీరు అందించలేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తమ గోడును వినిపించారు..దినేష్ కులచారి మాట్లాడుతూ... అప్రకటిత విద్యుత్ కోతల తో అన్నదాతలు అరిగోసా పడుతున్నరాని ఆవేదన వ్యక్తం చేశాడు.. రాష్ట్రంలో కాంగ్రెస్ అంటేనే కరువు అని మరోసారి రుజువైందని విమర్శించారు.

ఆపదలో ఉన్న అన్నదాతను ప్రభుత్వమే ఆదుకోవాలి...గతంలో పండించిన పంటల వివరాల ఆధారంగా ఎండిపోయిన పంటకు క్వింటాకు రూ.3400 చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా చేస్తే ఈ సమయంలో రైతులకు ఊరట కలిగించేదని పేర్కొన్నారు... ఎల్ వినో ప్రభావం ఉందని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు..ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షులు చంద్రకాంత్,నాయకులు, రైతులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD