Nizamabad: సాగునీటి కోసం ఆలీసాగర్ లిఫ్ట్ వద్ద బిజెపి ఆందోళన
Nizamabad: ఎడపల్లి ఆలీసాగర్ లిఫ్ట్ వద్ద బీజేపీ నేత వడ్డీ మోహన్ రెడ్డి రైతులతో ఆందోళన చేపట్టారు. నవీపేట్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
Nizamabad: సాగునీటి కోసం ఆలీసాగర్ లిఫ్ట్ వద్ద బిజెపి ఆందోళన
నిజామాబాద్: అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్నారని కనీస సాగునీటిని సైతం అందించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వడ్డీ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎడపల్లి మండలం అ లిసాగర్ లిఫ్టు వద్ద నవీపేట్ మండల రైతుల కోసం అందించే సాగునీరు విషయమై ఆందోళన కు దిగారు. దేశానికి వెన్నెముక లాంటి రైతుకు కనీస సాగునీటి అందించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి విఫలమైందన్నారు.
నిజాంసాగర్ నీటిని చివరాయ కట్టుకు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పొట్ట దశలో ఉన్న పంటలు కు సాగు నీరు అందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఈ రెండు నెలల పాటు సాగునీరు అందించి రైతుల నాదుకోవాలన్నారు. ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో ప్రతి ఏడు 30 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రైతులు ఎవరి ఆస్తులు అడగడం లేదని సాగనీరు ఇవ్వాలని బీజేపీ, ప్రతిపక్షాల అడుగుతున్నారు అన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ నిజాం సాగర్ నీటిని విడుదల చేయకపోవడంలో ఇరిగేషన్ శాఖ అధికారులు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభావంతో ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లి ప్రమాదం ఉందని రాష్ట్ర స్థాయి అధికారులు సైతం దీనిపై దృష్టి సారించి ముందు చూపు చర్యలు చేపట్టాలన్నారు.
ప్రస్తుత పంటకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు నీటిని విడుదల చేయడం లేదని మండిపడ్డారు. నిజం సాగర్ నీటిని శివరాయకట్టు ప్రాంతమైన నవీపేట్, రెంజల్ ప్రాంతం లోని చివరి ఆయకట్టు రైతులకు సావు నీటిని అందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు సాగునీటిపై దృష్టి సారించి ఆదుకోవాలడిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎడపల్లి మండల బిజెపి అధ్యక్షులు కోళ్ల ఇంద్రకరణ్, బోధన్ మండల అధ్యక్షులు సుదర్శన్ వివిధ మండల రైతులు ఆందోళన పాల్గొన్నారు.




