Bodhan: బోధన్‌లో బీడీ కార్మికుల భారీ ర్యాలీ.. ఆర్డీవో ఆఫీస్ ముట్టడి!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ, ఆందోళన నిర్వహించారు.
Bodhan: బోధన్‌లో బీడీ కార్మికుల భారీ ర్యాలీ.. ఆర్డీవో ఆఫీస్ ముట్టడి!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బీడీ కార్మికులు సోమవారం ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొంటూ శాంతియుత ర్యాలీ నిర్వహించి ఆర్డిఓ కార్యాలయం వరకు తరలి వెళ్లారు. ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి 2023లో ఇచ్చిన హామీ ప్రకారం నిబంధనలు తొలగించి బీడీ కార్మికులకు పెన్షన్లు అందజేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. తమను విస్మరించిందని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ బీడీ కార్మికులను మోసం చేసింది అన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి స్వప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. కార్మికులకు నిబంధనలను తొలగించి పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. బీడీ కార్మికులు శాంతియుతంగా ధర్నా చేపట్టిన అనంతరం ఆడియో సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు.




