Nizamabad: బోధన్లో పశువుల కొవ్వుతో కల్తీ నూనె తయారీ స్థావరం రట్టు!
Nizamabad: బోధన్ గాంధీనగర్లో పశువుల కొవ్వు, ఎముకలతో కల్తీ నూనె తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 900 లీటర్ల నూనె స్వాధీనం, ముగ్గురిని అరెస్ట్ చేశారు.
Nizamabad: బోధన్లో పశువుల కొవ్వుతో కల్తీ నూనె తయారీ స్థావరం రట్టు!
నిజామాబాద్: నిజామాబాద్ బోధన్ కన్నె రవి బోధన్ పట్టణంలోని గాంధీనగర్ లో పశువుల కొవ్వు, ఎముకలు చర్మంతో కల్తి నూనె తయారీ చేస్తున్న స్థావరంపై ఛీత పోలీస్ బృందం దాడులు నిర్వహించారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు గాంధీ నగర్ లో పశువుల కళేబరాలు కొవ్వు చర్మంతో పాటు ఇతర వ్యర్ధాలనుండి కల్తీ నూనెను తయారుచేసి పరువు రాష్ట్రమైన మహారాష్ట్ర తో పాటు పలు ప్రాంతాలకు నిర్వాహకులు సరఫరా చేస్తున్నారు.
పక్కా సమాచారం మేరకు ప్రజల ప్రాణాలకు హాని కలిగించే కల్తీ నూనెల తయారీ స్థావరంపై బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నిల్వ ఉంచిన పశువుల కొవ్వు, ఇతర వ్యర్ధాలు, ఎముకలు చర్మాలను స్వాధీన పరుచుకున్నారు.
దీంతోపాటు రవాణా తయారుగా ఉంచిన సుమారు 900 లీటర్ల కల్తీ నూనెను సైతం స్వాధీన పరుచుకొని నిర్వాహకులు ఫసి ఉద్దీన్, సోపి, అన్వర్ లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వెంకటనారాయణ వెల్లడించారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నూనె తయారీదారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని వెంకట్ నారాయణ వివరించారు.




