Bodhan: 270 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. వెనుక పెద్దల హస్తంపై ఆరోపణలు!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని సాయి ఆగ్రో ఇండస్ట్రీస్‌పై సీసీఎస్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 270 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం.
Bodhan: 270 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. వెనుక పెద్దల హస్తంపై ఆరోపణలు!
Bodhan: బోధన్ పట్టణంలోని శ్రీనివాస నగర్ కాలనీలో భారీగా పిడిఎస్ బియ్యాన్ని సిసిఎస్ పోలీస్ బృందం మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సిపి సాయి చైతన్య ఆదేశానుసాను సారం సిసిఎస్ ఏసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో బృందాలు దాడులు నిర్వహించి సుమారు 270క్వింటాళ్ల 70 కిలోల పిడిఎఫ్ బియ్యాన్ని సాయి ఆగ్రో ఇండస్ట్రీలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. నెలలో మూడుసార్లు సాయి ఆగ్రో ఇండస్ట్రీలో భారీ స్థాయిలో పిడిఎస్ బియ్యం పడడంతో బోధన్ లో కలకలం రేగింది.
అధికారులు ఎన్ని దాడు లు నిర్వహించిన పుట్టగొడుగుల సాయి ఆగ్రో ఇండస్ట్రీలో పిడిఎఎస్ బియ్యం లభ్యం కావడంతో అధికారుల్లో అలజడి చెలరేగింది. సాయి ఆగ్రో ఇండస్ట్రీ నిర్వాహకులు పిడిఎస్ బియ్యాన్ని భారీ స్థాయిలో నిల్వ నుంచి మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు తరిస్తున్నట్లు ఆరోపణ వెలువెత్తుతున్నాయి. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేపట్టినప్పటికీ పిడిఎఫ్ బియ్యం అక్రమ రవాణా కు అడ్డుకట్ట పడడం లేదు.
పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాకు రాష్ట్రస్థాయి నుండి పలురు అధికారులు అండదండలు ఉన్నట్లు ఆరోపణ సైతం గుప్పుమంటున్నాయి. పట్టుబడ్డ బియ్యాన్ని డిటి ఎన్ఫోర్స్ మెంట్ ఆధ్వర్యంలో పంచామాను నిర్వహించి సుమారు 8 లక్షల ఎనిమిది లక్షల పై చిలుకు బియ్యం పట్టుబడ్డట్లు అధికారుల అంచనా వేశారు. బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు.




