Bodhan: సాలూరు మండలం ఫతేపూర్‌లో 30 బోరుబావుల కేబుల్ వైర్ల చోరీ!

Bodhan: నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం ఫతేపూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు 30 వ్యవసాయ బోరుబావులకు సంబంధించిన రూ.2 లక్షల విలువైన కేబుల్ వైర్లను చోరీ చేశారు.

K RAVI, BODHAN
Published on: 15 Nov 2026 10:36 AM IST
Bodhan
X

Bodhan: సాలూరు మండలం ఫతేపూర్‌లో 30 బోరుబావుల కేబుల్ వైర్ల చోరీ!

బోధన్: నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం ఫతేపూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు వ్యవసాయ బోరుబావుల మధ్య కేబుల్ వైర్ల చోరీకి పాల్పడ్డారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ బోరుబావుల వద్ద సుమారు 30 బోరుబావులకు సంబంధించి కేబుల్ వైర్లను దుండగులు కత్తిరించుకొని దోచుకెళ్లినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

సుమారు రూ. రెండు లక్షల విలువగల కేబుల్ వైర్లను చోరీ చేసినట్లు రైతులు వెల్లడించారు. దుండగులను బోధన్ రూరల్ పోలీసులు ప్రత్యేక నిల ఏర్పాటుచేసి చోరీకి గురైన కేబుల్ వైర్లను గుర్తించి దుండగులపైదుండగుల ఫై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు రాత్రివేళలో కస్తి తిరిగినట్లయితే వ్యవసాయ బోరుబావుల వద్ద దొంగతనాలు జరగవని రైతులు పేర్కొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN