Nizamabad: రబి సాగుకు నీరు, విద్యుత్ ఇవ్వాలి - బీఆర్ఎస్ డిమాండ్

Nizamabad: బాన్సువాడ నియోజకవర్గంలో రబి పంట సాగు కోసం వెంటనే నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని, 9 గంటల విద్యుత్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

SALEEM, BANSWADA
Published on: 15 Nov 2026 4:49 PM IST
Nizamabad
X

Nizamabad: రబి సాగుకు నీరు, విద్యుత్ ఇవ్వాలి - బీఆర్ఎస్ డిమాండ్

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.బాన్సువాడ నియోజకవర్గం రైతులకు నిజాంసాగర్ నీటిని రబి పంట సాగు కోసం వెంటనే విడుదల చేయాలని 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే కు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

బాన్సువాడ నియోజకవర్గంలో పంటలు పండినట్లయితే ఇక్కడి రైతులకు వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందనీ అన్నారు.వరి సాగు తప్ప ఇక్కడ ఇతర పంటలకు భూమి అనుకూలంగా లేదని నిజాంసాగర్ ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు ఉందని అన్నారు.గతంలో 6 టిఎంసిల నీళ్లు ఉన్న సందర్భంలో కూడా నీటిని విడుదల చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

వర్ని ప్రాంతంలో మిగిలిపోయిన వారి ధాన్యాన్ని కూడా తక్షణమే ప్రభుత్వం క్వింటాలుకు 37 వందల చొప్పున కొనుగోలు చేయాలని ఎలమంచిలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.లేనిపక్షంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ సమావేశం లో రుద్రూర్ బీ ఆర్ ఎస్ నాయకుడు రవి కిరణ్, కోటగిరి మండల బీ ఆర్ ఎస్ పార్టీ నాయకుడు తేల్ల రవి,పోతంగల్ నాయకుడు సూదం నవీన్,వర్ని మండల నాయకుడు గంగప్ప, దౌడు సాయిలు,ఆమందు గోపి,బంజరు సుమన్,తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA