Nizamabad: కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే.. డిచ్‌పల్లి సమావేశంలో బీఆర్‌ఎస్ నేత ఫైర్!
Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం. కాంగ్రెస్, బీజేపీలపై వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర విమర్శలు.
Nizamabad: కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే.. డిచ్‌పల్లి సమావేశంలో బీఆర్‌ఎస్ నేత ఫైర్!
నిజామాబాద్ జిల్లా: రాష్ట్రంలో భాజపా చెప్పినట్లు కాంగ్రెస్ వింటోందని.. ఆ రెండు పార్టీలు కలిసి భారాసపై కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, భారాస సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ఆధ్వర్యంలో డిచ్ పల్లి లో జరి గిన రూరల్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
రైతులు, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి హిట్లర్ గతే పడుతుందన్నారు. ఏపీ ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల హైదరాబాద్ లో చేసిన వ్యాఖ్యల వెనుక ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉన్నారని. చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్ అని ఆరోపించారు. ప్రభుత్వ సహాయంతోనే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారని. అలాంటి తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారన్నారు.
కొత్త డిస్కం, హ్యామ్ రోడ్లతో రూ.వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ సిద్ధమైందని ఆరోపించారు. ధాన్యం కొను గోలు విషయంలో కాంగ్రెస్ సర్కారు రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. కేసీఆర్ హయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడలేదని గుర్తుచేశారు. యూరియా యాప్ పోవాలి.. బాపు రావాలే అని ప్రజలు అంటున్నా రని చెప్పారు. పోలీసులు భారాస కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని.. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుంచుకోవాలన్నారు.
కష్టకా లంలో పార్టీకి పనిచేసే కార్యకర్తలే దేవుళ్లని పేర్కొ న్నారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ. ఎన్నికలు వస్తే కేసీఆర్ను మళ్లీ సీఎం చెద్దామని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని చెప్పారు. రూ.50 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం తీసుకోవడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లా డుతూ. 'సర్' ప్రక్రియలో ఒక్క ఓటు పోకుండా కార్యకర్తలు చూసుకోవాలన్నారు. సభ్యత్వ నమోదు ఆన్లైన్ ద్వారా చేయాలని చెప్పారు.
మాజీ ఎమ్మె ల్యేలు జీవన్ రేడ్డి, గణేష్ గుప్తా, సురేందర్, హన్మంత్ షిండే ప్రసంగిస్తూ. బీసీలతోపాటు అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, భాజపా నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తారు. అనంతరం యూరియా యాప్ తీసేయా లని, రైతులకు 24 గంటల విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్లతో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమం లో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




