Yedapally: పేదల భూములపై కార్పొరేటర్ కన్ను.. నిజామాబాద్‌లో దళితుల ఆందోళన!
Yedapally: ఏడపల్లి జానకంపేటలో దళితుల భూములను నిజామాబాద్ కార్పొరేటర్ అక్రమ పట్టాలు చేసుకున్నట్లు ఆరోపణ. న్యాయం చేయాలని తహశీల్దార్‌కు బాధితుల వినతి.
Yedapally: పేదల భూములపై కార్పొరేటర్ కన్ను.. నిజామాబాద్‌లో దళితుల ఆందోళన!
Yedapally: ఏడపల్లి జానకంపేట గ్రామానికి చెందిన దళితుల భూములపై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కార్పొరేటర్ కన్నేసి అక్రమ పట్టాలు చేసుకున్నట్లు బాధితుల ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జానకంపేట గ్రామానికి చెందిన సాద పెద్ద అబ్బా యి, ఎంబ అనిల్, ఎంబ పోసాని, తాడెం గంగారాం, తాడెం పోశెట్టి, సాదపుష్ప, చిన్న అబ్బాయి, సాయమ్మ, బేగరిపోశెట్టి, శకుంతల, గుండాల భూలక్ష్మి, గుండాల నారాయణ లకు 1993 లో తల ఎకరం భూమని ప్రభుత్వం ఇచ్చింది. శాటాపూర్ గెట్ వద్ద గల నిజం షుగర్ ఫ్యాక్టరికి చెందిన భూములనుదళితులకు ఇచింది.
నాటి నుండి భూమి ని సాగు చేసుకుంటు జీవనాన్ని సాగిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను నిజామాబాద్ చెందిన తమ ప్రమేయం లేకుండా అక్రమ పట్టాలు చేసుకున్నాడని బాధితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. సదరు కార్పొరేటర్ తమపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రస్తుతం తాము కబ్జాలు ఉన్నామని ఏడపల్లి దత్తాత్రికి విన్నవించారు.
తమ భూములకు సంబంధించిన రికార్డులు ఇప్పించి న్యాయం చేయాలని బాధిత రైతులు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. తమను ఎడపల్లి ఎస్సై పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నారని అక్రమ పట్టా చేసుకున్న కార్పొరేటర్ కు వత్తాసు పలుకుతూ తమకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎస్ఐపై బాధితులు ఆరోపించారు. ఈ విషయమై ఎడపల్లి ఎస్సై రమ ను వివరణ కోరగా కార్పొరేటర్ పీరియదు చేసిన విషయం వాస్తవమేన్నారు. రైతుల వద్ద రికార్డులు ఉన్నట్లయితే తీసుకురావాలని సూచించామన్నారు.




