Nizamabad: మద్యం మత్తులో కన్నకొడుకుపై కత్తితో తండ్రి ఘోర దాడి!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఏడపల్లి మండలం కుర్నపల్లిలో మద్యం మత్తులో కొడుకు సుహాన్ పై తండ్రి శంకర్ కత్తిపోట్లు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Nizamabad: మద్యం మత్తులో కన్నకొడుకుపై కత్తితో తండ్రి ఘోర దాడి!
Nizamabad: నిజామాబాద్ జిల్లాఏడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో మద్యం మత్తులో కన్నా కడుక్కునే తండ్రి కత్తిపోట్లతో దాడి చేసిన ఉదంతం సంచలనం రేకెత్తించింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయిటి శంకర్ మద్యం మత్తులో కొడుకు సుహాను కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సుహాన్ పేగులు బయటపడి ఇంటి ముందర కొట్టుకుంటుండగా స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
శంకర్ ఇటీవలే దుబాయ్ నుండి స్వ గ్రామానికి వచ్చినట్లు శంకర్ భార్య గత ఏడాది క్రితం మృతి చెందిందని బంధువుల పేర్కొన్నారు. తండ్రి కొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవని మద్యం మైకంలో కొడుకు పై దాడి చేసి ఉండవచ్చు అని స్థానికులు వివరించారు. విషయం తెలుసుకున్న ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి శంకర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సుహాన్ ప్రస్తుతం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.




