Nizamabad: డిచ్‌పల్లి సీఎమ్‌సీలో త్వరలో నర్సింగ్, ఫార్మసీ కోర్సులు

Nizamabad: డిచ్‌పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (CMC)లో త్వరలో నర్సింగ్, ఫార్మసీ కోర్సులు ప్రారంభం కానున్నట్లు సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ యాజమాన్యం ప్రకటించింది.

M. RAMESH,NIZAMABAD
Published on: 16 Jun 2026 9:08 PM IST
Nizamabad
X

Nizamabad: డిచ్‌పల్లి సీఎమ్‌సీలో త్వరలో నర్సింగ్, ఫార్మసీ కోర్సులు

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (సిఎంసి)లో త్వరలో నర్సింగ్ తరగతులు క్రమబద్ధంగా నిర్వహించబడుతున్నాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. మెదక్ డయాసిస్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్‌ఐ) ఆధ్వర్యంలో ఈ విద్యాసంస్థ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని పేర్కొంది. సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ ప్రతినిధులు నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,

గతంలో మాజీ ఐఏఎస్ అధికారిగా పరిచయం చేసుకున్న షణ్ముఖ లింగం అనే వ్యక్తి సిఎంసి పేరును ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు, సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ అంశం ప్రస్తుతం చట్టపరమైన పరిధిలో ఉందని పేర్కొన్నారు.

అలాగే, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రజా సంక్షేమం, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తోందని సీఎస్‌ఐ మెదక్ డయాసిస్ డైరెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు విద్యా, వైద్య రంగాల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందన్నారు. త్వరలో నర్సింగ్, ఫార్మసీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంబంధిత ప్రభుత్వ అనుమతులు లభించిన అనంతరం ప్రవేశాలపై పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story