Nizamabad: ప్రభుత్వ బడులను బాగు చేసేందుకే రాష్ట్రవ్యాప్త పర్యటన!

Nizamabad: రాష్ట్రంలో విద్యారంగ ప్రక్షాళన కోసం మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి నిజామాబాద్ జిల్లా అబ్బపూర్ ప్రభుత్వ పాఠశాలలో రాత్రి బస చేసి ప్రభుత్వ విద్య మెరుగును కోరారు.

K RAVI, BODHAN
Published on: 19 Sept 2026 10:32 AM IST
Nizamabad
X

Nizamabad: ప్రభుత్వ బడులను బాగు చేసేందుకే రాష్ట్రవ్యాప్త పర్యటన!

Nizamabad: రాష్ట్రం లో విద్య విప్లవ ము తేవడానికే ప్రభుత్వ స్కూల్స్ లో నైట్ హల్ట్ చెయ్యడం జరుగుతుందని రిటైడ్ ఐ ఏ ఎస్ మాజీ విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు . నిజామాబాదు జిల్లా నవీపేట్ మండలం అబ్బపూర్ ఎం గ్రామం లో శుక్రవారం ప్రభుత్వ పాఠశాల లో నైట్ హల్ట్ (నిద్రించారు )చేశారు.

అంతకు ముందు గ్రామస్థులతో మాట్లాడు తు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 18శాతం నిధులను విద్యాబివృద్ధి కి వెచ్చిస్తే ప్రభుత్వ పాఠశాల నుండి యూనివర్సిటీ ల వరకు ఐదు ఆరు సంవత్సరాలలో విద్య వ్యవస్థమెరుగు పడే అవకాశం ఉంటుం దన్నారు.

ప్రస్తుతం ఎక్కడ విద్య వ్యవస్థ బాగుపడితే ప్రజలు ప్రశ్నిస్తరనే ఉద్దెశం తో రాజకీయ నాయకులు ఈ వ్యవస్తాను బాగుచేయడం లేదని గ్రామాల్లో స్కూల్స్ బాగు చేస్తేనే ఓట్లు వేస్తామనే విధంగా ప్రజలను చైతన్యం చేయడానికి రాష్ట్రం మొత్తం తిరుగటం జరుగుతుందపేర్కొన్నారు.

అయన వెంట రిటైడ్ ఐ ఏ ఎస్. చంపాలల్, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శివ ప్రసాద్, యూత్ కళ్యాణ్ ఓయూ ప్రొపెసర్ పద్మజ షా, డి బి ఎఫ్ పెద్ద లింగన్న గారి శంకర్, డి ఎల్ ఎఫ్ మార్వాడి సుదర్శన్, డాక్టర్ జగదీష్, సంస్కృతి విభాగం మచ్చ దేవేందర్, సృజన యాదవ్, నిఖిల్, విజయ్ కృష్ణ, రూబీనా తదితరులు ఉన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN