Rudrur: 2 లక్షల గరికతో వినాయకుడికి విశేష అలంకరణ

Rudrur: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ శ్రీ సార్వజనిక్ గణేష్ మండపంలో స్వామివారిని రెండు లక్షల గరికలతో అత్యంత భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా అలంకరించారు.

SALEEM, BANSWADA
Published on: 20 Sept 2026 4:32 PM IST
Rudrur
X

Rudrur: 2 లక్షల గరికతో వినాయకుడికి విశేష అలంకరణ

నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండపంలో కొలువుదీరిన గణనాథుడిని ఆదివారం రెండు లక్షల గరికలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ పూజారి రాము శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి నిర్వాహకులు, సభ్యులు, మహిళలు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA