Banswada: రుద్రూర్‌లో వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి బోనాలు!

Banswada: రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి బోనాలు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాల నడుమ బోనాల సమర్పణ.. హాజరైన పలువురు ప్రముఖులు.

SALEEM, BANSWADA
Published on: 2 Aug 2026 12:43 PM IST
Banswada
X

Banswada: రుద్రూర్‌లో వైభవంగా మహాలక్ష్మి అమ్మవారి బోనాలు!

రుద్రూర్ లో ఘనంగా భవనాల పండుగ.

నిజామాబాద్ జిల్లా

రుద్రూర్ మండలకేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని గ్రామ వతందర్ వెంకటేశ్వర దేశాయ్ ఇంటి నుండి మహాలక్ష్మి దేవి ఆలయనికి బోనాలను డప్పువాయిద్యాలు డీజే చెప్పుల్ల మధ్య పోతురాజుల నృత్యాలతో ఘనంగా ఊరేగింపుగా అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పచ్చగ ఉండాలని డాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామపెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వతందార్ వెంకటేశ్వర దేశాయ్, గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఏం సి చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్,బచ్చు రామ్ సెట్,బద్దం సంజీవ్ రెడ్డి,పత్తి రాము, లక్ష్మణ్,కాటికే రామ్ రాజ్,బొట్టే గజేందర్, డౌర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story