Nizamabad: మల్లాపూర్ బ్రిడ్జి వద్ద చిరుత సంచారం.. ప్రజల్లో భయాందోళనలు!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మల్లాపూర్ లోలం బ్రిడ్జి సమీపంలో చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు.
Nizamabad: మల్లాపూర్ బ్రిడ్జి వద్ద చిరుత సంచారం.. ప్రజల్లో భయాందోళనలు!
నిజామాబాద్ జిల్లా: మల్లాపూర్లో చిరుత సంచారం.. స్థానికుల్లో భయం ఇందల్వాయి మండలం మల్లాపూర్ లోలం బ్రిడ్జి సమీపంలో చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి రవిమోహన్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
అక్కడ చిరుత అడుగుల ఆనవాళ్లు కనిపించినట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, చిరుత కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అడవి జంతువులు కనిపిస్తే ప్రజలు ఎటువంటి హాని చేయకూడదని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు.
Next Story




