Nizamabad: గ్రామస్తుల ఒత్తిడితో ఎలక్ట్రిషియన్ ఆత్మహత్య.. నిజామాబాద్‌లో కలకలం!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో ఒక వ్యక్తి ఆత్మహత్య. ఎలక్ట్రిషియన్ పనిలో జరిగిన ప్రమాదం విషయంలో గ్రామస్తుల ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడ్డట్లు ఆరోపణలు.
Nizamabad: గ్రామస్తుల ఒత్తిడితో ఎలక్ట్రిషియన్ ఆత్మహత్య.. నిజామాబాద్‌లో కలకలం!
నిజామాబాద్ జిల్లా: ధర్పల్లి మండలం గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన కుంట గంగాధర్ (43 ) ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు.. మృతుని భార్య కుంటా వసంత తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త కుంట గంగాధర్ (43) వ్యవసాయం,ఎలక్ట్రిషియన్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
గత మే నెలలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి విద్యుత్ పనుల చేస్తున్న సమయంలో అతనికి కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు గంగాధర్‌ను బాధ్యుడిగా చేస్తూ, గాయపడిన వ్యక్తికి పరిహారం చెల్లించాలని కొంతమంది గ్రామస్తులు పలుమార్లు ఒత్తిడి తేవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించరని ఎస్.ఐ సందీప్ తెలిపారు.
Next Story




