Nizamabad: SIR పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Nizamabad: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 8 Jun 2026 8:14 AM IST
Nizamabad
X

Nizamabad: SIR పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

Nizamabad: నిజామాబాద్ రూరల్ నియోజవర్గ పరిధిలోని 293 మంది కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు SIR పై డిచ్ పల్లి మండల శివారులోని అమృత గార్డెన్ లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన యువతను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలి అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఓట్లను కొల్లగొట్టి గెలవాలని ప్రయత్నాలు చేస్తుందని దాన్ని బూత్ లెవెల్ ఏజెంట్లు సైనికుల్లా పనిచేసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు జరగనున్న SIR ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించి.

ఏ ఒక్క ఓటు కూడా పోకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు సమర్థవంతంగా పనిచేసినప్పుడే ఈ బీజేపీ ఓట్ల కుట్రను తిప్పికొట్టవచ్చని సూచించారు. ప్రతి బూత్‌ను పార్టీ బలానికి కేంద్రంగా మార్చాలి. ఓటరు జాబితా పరిశుభ్రంగా, ఖచ్చితంగా ఉండేలా కృషి చేయాలి.

ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలను తెలుసుకోవాలి.గ్రామ, వార్డు స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. బీహార్, బెంగాల్ లో బీజేపీ అవలంబించిన తీరు మన దగ్గర జరగకుండా ఉండాలంటే ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్లు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఎర్రన్న, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపుర్ గంగాధర్,బాల్ రాజు, మోపాల్ సాయరెడ్డి, నవీన్ గౌడ్, చిన్నారెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు వాసు, శ్రీనివాస్, జలందర్ , కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ పరిధిలోని బూత్ లెవెల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొనారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story