Nizamabad: డిచ్‌పల్లిలో కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆత్మీయ భేటీ

Nizamabad: డిచ్‌పల్లి వెస్లీ నగర్ తండాలో కాంగ్రెస్ శ్రేణులతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి ఆత్మీయ భేటీ. దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.

M. RAMESH,NIZAMABAD
Published on: 21 Oct 2026 4:57 PM IST
Nizamabad
X

Nizamabad: డిచ్‌పల్లిలో కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆత్మీయ భేటీ

నిజామాబాద్: విజయదశమి దసరా పండుగ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. బుధవారం డిచ్‌పల్లి మండలం వెస్లీ నగర్ తండాలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే కి దసరా శుభాకాంక్షలు తెలిపారు. డిచ్ పల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు అంబర్ సింగ్ ఏర్పాటు చేసిన విందులో ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలిసి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD