Nizamabad: బీజేపీలోకి జీవన్ రెడ్డి? క్లారిటీ ఇచ్చిన ఎంపీ అరవింద్

Nizamabad: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారంపై ఎంపీ అరవింద్ స్పందించారు. ఆయన పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.

VAMSHI, ARMOOR
Published on: 22 April 2026 8:24 PM IST
Nizamabad
X

Nizamabad: బీజేపీలోకి జీవన్ రెడ్డి? క్లారిటీ ఇచ్చిన ఎంపీ అరవింద్

ఆర్మూర్ న్యూస్: ఆర్మూర్ నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే & జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరుతున్నట్టు స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతుంది, ఇటీవల అయిన ఢిల్లీకి వెళ్లి బిజెపి పార్టీ అగ్ర నేతలతో మంతనాలు జరపారని, అందుకే అతనికి జగిత్యాల్ లో జరిగిన సభకు జీవన్ రెడ్డి కి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వలేనని చర్చగా కొనసాగింది, ఈ మధ్యకాలంలో brs పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం, పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

నిజామాబాద్ జిల్లా ఎంపీ బిజెపి ధర్మపురి అరవింద్ స్పందన:

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు & మాజీ ఎమ్మెల్యే ఆర్మూర్ జీవన్ రెడ్డి బిజెపి పార్టీకి వెళ్తున్నారని స్థానికంగా జోరుగా చర్చ కొనసాగుతుంది, ఈ విషయంపై నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ, అలాంటిదేమీ లేదు తన వ్యాపార కోసమే, ఢిల్లీకి వెళ్లి ఉండొచ్చుని సమాచారం ఇచ్చారు, కాగా జీవన్ రెడ్డి బిజెపి నేతలతో కలిసి ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తన నివాసానికి వెళ్లినట్టు సమాచారం, అంతే తప్ప తాను ముమ్మాటికి బిజెపి పార్టీలో చేరడం లేదు.

నియోజవర్గ ప్రజలకు, రెండు పార్టీ నేతలకు,కార్యకర్తలకు, నాయకులకు:

నియోజవర్గ ప్రజలు, ఇతర పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు, నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవిందు తన వివరణ నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బిజెపి పార్టీలో చేయడం లేదు అని చెప్పడంతో,ఒకేసారిగా నియోజవర్గ ప్రజలు పార్టీ నేతలు ఊపిరి పిలిచారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story