Dichpally: డిచ్‌పల్లిలో చురుగ్గా ఎస్‌ఐఆర్ ప్రక్రియ - హియరింగ్ పరిశీలన

Dichpally: డిచ్‌పల్లి మండలం నడిపల్లిలో ఓటర్ల ఎస్‌ఐఆర్ హియరింగ్ పరిశీలించిన ఎమ్మార్వో సతీష్ రెడ్డి. ఓటర్లు ధృవీకరణ పత్రాలతో పాల్గొనాలని సూచన.

M. RAMESH,NIZAMABAD
Published on: 15 Sept 2026 4:19 PM IST
Dichpally
X

Dichpally: డిచ్‌పల్లిలో చురుగ్గా ఎస్‌ఐఆర్ ప్రక్రియ - హియరింగ్ పరిశీలన

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల పరిధిలో SIR ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. నడిపల్లి గ్రామపంచాయతీ లో ఓటర్లకు హియరింగ్ కొనసాగింది. హియరింగ్ తీరును డిచ్ పల్లి ఎమ్మార్వో సతీష్ రెడ్డి పరిశీలించారు.

ఓటర్లకు ఎలాంటి అసౌకార్యాలు కలుగకుండా చూడాలని,ఓటర్లు తమకు వచ్చిన నోటీసులకు తగిన ధృవీకరణ పత్రాలతో వచ్చి,హియరింగ్ లో పాల్గొనాలని, బి.ఎల్.ఓ, జీపీవో ల కు సిబ్బందికి సహరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో R.I సంతోష్ కుమార్ ,GPOలు రవేందర్, శ్రీనివాస్, సుధాకర్,భూషణ్,కార్తిక్ పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD