Nizamabad: ఏ పండుగొచ్చినా తొలుత గాంధీ విగ్రహానికి పూజలు
Nizamabad: నిజామాబాద్ జిల్లా నర్సింగ్‌పూర్ గ్రామంలో ఏ పండుగైనా, శుభకార్యమైనా ముందుగా గాంధీ విగ్రహానికి పూజలు చేసే సంప్రదాయాన్ని గ్రామస్తులు నేటికీ కొనసాగిస్తున్నారు.
Nizamabad: ఏ పండుగొచ్చినా తొలుత గాంధీ విగ్రహానికి పూజలు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం నర్సింగ్ పూర్ (కొత్తపేట) గ్రామంలో ఎటువంటి పండుగ జరిపిన ప్రతి ఇంటి వారు మొదటగా గ్రామంలోని గాంధీ విగ్రహం దగ్గర కొబ్బరికాయ కొట్టి జలాభిషేకం చేసి పూలదండ వేసి పూజలు నిర్వహించిన అనంతరం ఇండ్లలో తమతమ శుభకార్యం చేసుకోవడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు ఇలా జరుపుకోవడం తాత ముత్తాతలు నుండి ఆనవాయితీ వస్తుందని.
గ్రామంలో గాంధీ జయంతి నాడు ఒకరు జన్మించారు. అతనికి గాంధీ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. అతను జన్మించిన నాటి నుండి అప్పటినుండి గాంధీ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.




