Nizamabad: మద్యం మత్తులో పురుగుల మందు సేవించి యువ రైతు మృతి!

Nizamabad: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోల గ్రామంలో విషాదం నెలకొంది. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు పురుగుల మందు సేవించి పాతర్ల నవీన్ (28) అనే యువ రైతు మృతి చెందాడు.

K RAVI, BODHAN
Published on: 20 May 2026 11:25 AM IST
Nizamabad
X

Nizamabad: మద్యం మత్తులో పురుగుల మందు సేవించి యువ రైతు మృతి!

నిజామాబాద్ జిల్లా: నవీపేట్ మండలం బి నోల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో పురుగుల మందు సేవించి మృత్యువాత పడ్డ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. బినోల చెందిన పాతర్ల నవీన్ అనే 28 యువరైతు సోమవారం తన వ్యవసాయ పొలం వద్ద మద్యం సేవించాడు. మద్యం సేవించిన మత్తులో పంట పొలాల్లో పిచికారి చేసిన పురుగుమందు సైతం సేవించడంతో నవీన్ అస్వస్థత గురయ్యాడు. తన సోదరుడు శ్రీధర్ కు ఫోన్ ద్వారా తాను అనుకోకుండా సేవించానని సమాచారం ఇవ్వడంతో పంటపొలానికి చేరుకున్న నవీన్ సోదరుడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందడంతో నవీన్ పెట్ ఎస్ఐ శ్రీకాంత్ మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం తరలించారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించే నవీన్ ప్రమాదవశాత్తు కురుమను శవించడంతో తన భర్త మృతి చెందాడని మృతుని భార్య బోరు న విలపించింది. మృతునికి కుమారుడు నాలుగేళ్ల కుమారుడు మూడు నెలల కూతురు సంతానం ఉన్నారు. నవీన్ మృతితో తన కుటుంబం వేదన పడిందని కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతం మయ్యారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story