Nizamabad: చంద్రాయన్‌పల్లి వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు: సీపీ!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి వద్ద ఎన్‌హెచ్-44పై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సీపీ పి. సాయి చైతన్య అధికారులను ఆదేశించారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 30 Oct 2026 10:06 AM IST
Nizamabad
X

Nizamabad: చంద్రాయన్‌పల్లి వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు: సీపీ!

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను తనిఖీ చేసి, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

కల్వర్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నేషనల్ హైవే మేనేజర్ రంగారావు, కాంట్రాక్టర్ బాల్ రెడ్డిని ఆదేశించారు. నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వాహనాల వేగ నియంత్రణకు సూచిక బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లోనూ ప్రమాద ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ, జాతీయ రహదారుల అధికారులు, కాంట్రాక్టర్లు, టోల్ ప్లాజా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, హైవే మేనేజర్ రంగారావు, కాంట్రాక్టర్ బాల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మలేష్, డిచ్‌పల్లి సీఐ కె. వినోద్, ఇందల్వాయి ఎస్‌.ఐ సుమలత, చంద్రాయన్‌పల్లి సర్పంచ్ రఘు, టోల్ ప్లాజా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD