Nizamabad: యాంటీ డ్రగ్స్ పైన అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తీర్మాన్‌పల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ.
Nizamabad: యాంటీ డ్రగ్స్ పైన అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు
Nizamabad: మాదక ద్రవ్యాల నిర్మూలన సమాజంలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా, ఇందల్వాయి మండలం తీర్మాన్‌పల్లి గ్రామంలో జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పోలీసు సిబ్బంది యాంటీ డ్రగ్ అవగాహన ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య, విద్య, కుటుంబ సామాజిక దుష్ప్రభావాలపై అవగాహన కల్పించరు.
ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు అవగాహన ప్లకార్డులు ప్రదర్శిస్తూ “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించండి” అనే నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..
మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యల గురించి వివరించి, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే గ్రామస్థులు తమ పరిసరాల్లో అనుమానాస్పద డ్రగ్స్ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
విద్యార్థులఅందరితో కలిసి పోలీస్ సిబ్బంది యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించరు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్. ఐ సుమలత, పోలీస్ సిబ్బంది,ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థి విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




