Nizamabad: అక్రమ మొరం రవాణాపై పోలీసుల మెరుపు దాడి: 2 జేసీబీలు, 13 ట్రాక్టర్లు స్వాధీనం

Nizamabad: నిజామాబాద్ జిల్లా మైలారం పెద్ద వాగులో అక్రమ మొరం తవ్వకాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 11 May 2026 8:17 PM IST
Nizamabad
X

Nizamabad: అక్రమ మొరం రవాణాపై పోలీసుల మెరుపు దాడి: 2 జేసీబీలు, 13 ట్రాక్టర్లు స్వాధీనం

ధర్పల్లి (నిజామాబాద్ జిల్లా): నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలు మరియు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా CCS ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీత ఫోర్స్ ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామంలోని పెద్ద వాగు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తూ రవాణా చేస్తున్న వాహనాలను గుర్తించారు. వెంటనే మెరుపు దాడి నిర్వహించి, తవ్వకాలకు ఉపయోగిస్తున్న 2 జేసీబీ యంత్రాలు మరియు మొరం రవాణాకు వినియోగిస్తున్న 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని ధర్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story