Nizamabad: నిజామాబాద్ రాంపూర్ గ్రామంలో వైభవంగా ఊర పండుగ ఉత్సవాలు

Nizamabad: నిజామాబాద్ జిల్లా రాంపూర్‌లో ఊర పండుగ ఘనంగా జరిగింది. 12 గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, పోతరాజుల విన్యాసాలతో గ్రామస్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 25 Oct 2026 11:35 AM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ రాంపూర్ గ్రామంలో వైభవంగా ఊర పండుగ ఉత్సవాలు

Nizamabad: డిచ్‌పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో ఊర పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 12 గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవతామూర్తులను కప్పెరతో ప్రధాన వీధుల గుండా ఊరేగించారు.

గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు విస్తారంగా కురవాలని, చిన్నా పెద్దా అందరూ సుఖశాంతులతో జీవించాలని గ్రామస్థులు మొక్కులు చెల్లించుకున్నారు.పండుగలో భాగంగా పోతరాజుల విన్యాసాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహిస్తూ సందడి చేశారు.

సంప్రదాయ ఆచారాల ప్రకారం గ్రామ దేవతలను ఆరాధించి, గ్రామానికి ఎలాంటి అనారోగ్యాలు, ప్రకృతి విపత్తులు కలగకుండా దేవతలు కాపాడాలని ప్రార్థించారు. ఊర పండుగ గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. కులమతాలకు అతీతంగా గ్రామస్థులంతా కలిసికట్టుగా ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ముఖ్యంగా ఆసది, పోతరాజులు, గుండ్ల కులస్తులు గ్రామ దేవతల సేవల్లో భాగస్వాములై సంప్రదాయ పూజలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు , కాయితి రాజ్‌కుమార్, ఉపసర్పంచ్ మోతే రాజ్‌కుమార్, వీడీసీ సభ్యులు షేరుచిన్న వీరయ్య, పాపాయి లింబాద్రి, నెంబర్ రాజన్న, కురమ లక్ష్మయ్య, భీపురం చిన్న బాలయ్య, గుండ్ల పెద్ద గంగాధర్, ప్రవీణ్, లచ్చమొల్ల రాజు, లింగుల ప్రవీణ్, చిన్న ఎర్రన్నతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD