Nizamabad: కారుపై పడ్డ కరెంట్ తీగలు.. చావు నోట్లోంచి డ్రైవర్ మిరాకిల్ ఎస్కేప్!
Nizamabad: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్న గుట్ట శివారులో ఘోర కారు ప్రమాదం జరిగింది.
Nizamabad: కారుపై పడ్డ కరెంట్ తీగలు.. చావు నోట్లోంచి డ్రైవర్ మిరాకిల్ ఎస్కేప్!
Nizamabad: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్న గుట్ట శివారులో ఒక కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. కళ్యాపూర్ వైపు వెళ్తున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి, అనంతరం పొలంలో బోల్తా పడింది.
ఈ ప్రమాద ధాటికి విద్యుత్ పోల్ పూర్తిగా విరిగిపోవడమే కాకుండా, విద్యుత్ మెయిన్ లైన్ తీగలు తెగి నేరుగా కారుపై పడ్డాయి. ఆ సమయంలో కారులో ఉన్న వ్యక్తి అత్యంత సాహసంతో కారు అద్దాలను పగులగొట్టుకుని సకాలంలో బయటకు దూకేశాడు.
విద్యుత్ తీగలు కారుపై పడినప్పటికీ, సదరు వ్యక్తి కేవలం స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తూ అతడిని అదృష్టవంతుడిగా భావిస్తున్నారు.
ప్రమాదానికి గురైన వ్యక్తి కళ్యాపూర్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. సమాచారం అందుకున్న రెంజల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు.




