Nizamabad: డిచ్‌పల్లిలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, ఒకరు మృతి!

Nizamabad: నిజామాబాద్ డిచ్‌పల్లి NH 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

M. RAMESH,NIZAMABAD
Published on: 10 Sept 2026 2:45 PM IST
Nizamabad
X

Nizamabad: డిచ్‌పల్లిలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, ఒకరు మృతి!

నిజామాబాద్ జిల్లా: 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం లారీని, కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి వద్ద చోటుచేసుకుంది... హైదరాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్తున్న డీసీఎం లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమాచారం అందుకున్న హైవే సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్స్‌లో నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నిర్మల్‌ జిల్లాకు మంజులాపూర్ కు చెందిన బోజన్న పోలీసులు గుర్తించారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story