Nizamabad: ‘చలో ఢిల్లీ’కి నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ శ్రేణులు!

Nizamabad: రాహుల్ గాంధీ పిలుపు మేరకు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశాలతో నిజామాబాద్ రూరల్ నుంచి 100 మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లాయి.

M. RAMESH,NIZAMABAD
Published on: 1 Nov 2026 7:56 PM IST
Nizamabad
X

Nizamabad: ‘చలో ఢిల్లీ’కి నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ శ్రేణులు!

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ హక్కులు, ప్రజల ఓటుహక్కును కాపాడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన 100 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి బయలుదేరారు. వీరిలో కొందరు రైలు మార్గంలో, మరికొందరు హైదరాబాద్, నాగ్‌పూర్ విమానాశ్రయాల నుంచి విమానాల్లో, ఇంకొందరు బస్సులు, ఇతర రవాణా మార్గాల్లో పయనమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం SIR ప్రక్రియ పేరుతో ప్రజల రాజ్యాంగబద్ధమైన ఓటుహక్కుకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, దాని పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. SIR వివాదంపై ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం లో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్లు సాయారెడ్డి, తారాచంద్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పొలసాని శ్రీనివాస్, రామచందర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చింతల కిషన్, గోవర్ధన్ రెడ్డి, రవి, గాదె నరేష్, జనార్ధన్, మాజీ ఎంపీపీ రాజన్న, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మహేందర్, కార్పొరేటర్ భోజన్న తదితరులు పాలుగోన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD