Nizamabad: యూరియా యాప్ ని తక్షణమే రద్దు చేయాలి.. BRS డిమాండ్
Nizamabad: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ ఆధ్వర్యంలో రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు.
Nizamabad: యూరియా యాప్ ని తక్షణమే రద్దు చేయాలి.. BRS డిమాండ్
Nizamabad: రైతులకు సంకటంగా మారిన యూరియా యాప్ ని తక్షణమే రద్దు చేయాలని భారస నాయకుడు మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ డిమాండ్ చేశారు.. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ భారస నాయకుడు మాట్లాడుతూ ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వమని, యూరియా యాప్ వల్ల రైతులకు లేని కష్టాలను ఈ ప్రభుత్వం తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ఈ యాప్ ని రద్దుచేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Next Story




