Nizamabad: అదుపుతప్పి బ్రిడ్జికి ఢీ.. గాల్లో వేలాడిన ట్రాక్టర్
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో ఒక అరుదైన ప్రమాదం చోటుచేసుకుంది.
Nizamabad: అదుపుతప్పి బ్రిడ్జికి ఢీ.. గాల్లో వేలాడిన ట్రాక్టర్
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో ప్రమాదం తృటిలో తప్పింది. అక్రమంగా మొరం తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బ్రిడ్జ్‌ను ఢీకొట్టడంతో బ్రిడ్జ్‌పై నుంచి వేలాడింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం జేసీబీ సహాయంతో ట్రాక్టర్‌ను బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




