Nizamabad: నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఉద్యమకారుల కమిటీ

Nizamabad: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం తెలంగాణ యూనివర్సిటీలో అడ్-హక్ కమిటీ ఏర్పాటు. ప్రభుత్వంపై పలు డిమాండ్ల వర్షం కురిపించిన ఉద్యమకారులు.

M. RAMESH,NIZAMABAD
Published on: 14 July 2026 8:50 PM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో ఉద్యమకారుల కమిటీ

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ యూనివర్సిటీ లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు చేసిన ఉద్యమ కారుల సమావేశం ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ బిల్డింగ్ లోని సెమినార్ హాల్ లో జరిగింది. దాదాపు 25 మంది విద్యార్థి ఉద్యమకారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డా.పిట్ల సరిత మాట్లాడుతూ నాడు యూనివర్సిటీ లో విద్యార్థులుగా ఉంటూ మెస్ లు మూసేసినా, అనేక ఆటంకాలు సృష్టించినా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశామని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. జిల్లా అంతటా తెలంగాణ ఉద్యమాన్ని విస్తరించేలా కృషి చేశామని తెలిపారు.తెలంగాణ ఉద్యమం వల్ల చదువులకు ఆటంకాలు వచ్చాయని, అయినా వెనకడుగు వేయలేదని అన్నారు.

విలువైన సమయాన్ని ఉద్యమం కోసం కేటాయించాము అన్నారు. కానీ ప్రభుత్వం నియమించిన కమిటీ కొంతమందికే సమాచారం ఇచ్చి సలహాలు స్వీకరిస్తుందని, అసలైన ఉద్యమకారులను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం నియమించిన కేకే కమిటీ అసలైన ఉద్యమకారులను గుర్తించి తగు న్యాయం చెయ్యాలని కోరారు. ఉద్యమకారులు మాట్లాడుతూ కింది డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచారు.

ప్రధాన డిమాండ్స్...

1.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ప్రకటించినట్టు 250 గజాల స్థలాన్ని ఇవ్వాలి

2.ఉద్యమకారులకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో అవలంభించిన విధానం ను అధ్యయనం చేసి,దాని ప్రకారం సమాంతర రిజర్వేషన్ లు ఇచ్చి న్యాయం చెయ్యాలి.

3.ఉద్యమకారులకు వారు చేస్తున్న కాంట్రాక్ట్ , అవుట్సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైమ్ ఉద్యోగాలను రెగ్యులర్ చెయ్యాలి

4.ఉద్యమకారులకు హెల్త్ కార్డు లు,ఉద్యమ కారుల గుర్తింపు కార్డు లు ఇవ్వాలి.

5.మహిళా ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తించి న్యాయం చెయ్యాలి

ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఉద్యమకారుల సమన్వయం కోసం ఒక ad-hoc కమిటీ ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులుగా LB రవి కుమార్, డా.ఎన్.సౌందర్య, డా.ప్రసన్న , డా.ఎం.సిద్ధలక్మి, డా.E.శ్రీనివాస్ గౌడ్, డా.పుప్పాల రవి, డా.రవీందర్ నాయక్,బట్టు సురేష్,సంతోష్,బాల రాజు నాయక్, సుధాకర్,డా.రమేష్ నాయక్,డా.భరత్,పిల్లి శ్రీకాంత్ ,డా.పులి జైపాల్,డా.PB సత్యం లను ఎన్నుకున్నారు. మిగతా యూనివర్సిటీ ఉద్యమకారుల గుర్తించి,వారిని సమన్వయం చేసేలా ఈ కమిటీ కృషి చేస్తుందని తెలిపారు.

ప్రభుత్వం నియమించిన కేకే కమిటీ కి సమన్వయం చేయడానికి ఇక నుంచి వీరే ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమం లో డా.సరిత పిట్ల,పస్కా నర్సయ్య, వాసరి సాయినాథ్,ఎండల ప్రదీప్, పిల్లి శ్రీకాంత్, డా.పులి జైపాల్,డా. శ్రీనివాస్ గౌడ్, డా. పుప్పాల రవి, డా. సౌందర్య, డా. సిద్దలక్ష్మి, డా.ప్రసన్న,విజయలక్ష్మి, స్వరూప, బాలరాజు నాయక్, సంతోష్, రమేష్ నాయక్, డా. భరత్, డా. సత్యం, డా. రవీందర్ నాయక్, సురేష్ బట్టు తదితరులు పాల్గొన్నారు

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story