Nizamabad: జాకోరాలో బతుకమ్మ సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం!

Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

SALEEM, BANSWADA
Published on: 12 Oct 2026 11:15 PM IST
Nizamabad
X

Nizamabad: జాకోరాలో బతుకమ్మ సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం!

Nizamabad: వర్ని మండలం జాకోరా గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ రామదూత దేవి మండలి ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన అమ్మవారిని పోచారం శ్రీనివాసరెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గ్రామంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయదుస్తులు ధరించి, బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA