Nizamabad: చట్టబద్ధత లేని వీడీసీలను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి!

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో వీడీసీ అణచివేతలు, గ్రామ బహిష్కరణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 1 Oct 2026 10:46 AM IST
Nizamabad
X

Nizamabad: చట్టబద్ధత లేని వీడీసీలను వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి!

నిజామాబాద్ జిల్లా:రాష్ట్ర DGP సి.వి ఆనంద్ ని కలిసిన తాళ్ళరాంపుర్ VDC బాధితులు .. గ్రామ బహిష్కరణ , వెలివేయడం వంటి చర్యలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ నీ కోరిన - మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ .VDC లను తక్షణమే రద్దు చేయాలని కోరిన - బట్టు శ్రీధర్ .వీడీసీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు.చట్టబద్ధత లేని VDC లను రద్దు చేయాలి - ILPA రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ పొన్నం దేవరాజ్ గౌడ్.'

న్యాయం జరిగే వరకు పోరాడుతాం అని బాధితులు తెలిపారు. హైదరాబాద్ లోని DGP రాష్ట్ర కార్యాలయంలో తాళ్ళరాంపూర్ గ్రామ VDC బాధితుల తో కలిసి రాష్ట్ర DGP సి.వి ఆనంద్ ని కలిసిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ , ILPA రాష్ట్ర అధ్యక్షులు విజయ్ దేవరాజ్, VDC వ్యతిరేక పోరాట సమితి నాయకుడు బట్టు శ్రీధర్..నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ , బాల్కొండ , నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలో కులవృత్తులపై ఆంక్షలు విధించడం, వాటిని వ్యతిరేకించిన వారిని గ్రామ బహిష్కరణ, సామాజిక వెలివేతకు గురిచేయడంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కోరారు.

ఈ మేరకు హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.కల్లు గీయడం, చేపలు పట్టడం అమ్మడం, చావు డప్పులు మోయడం, గడ్డం గీయడం, బట్టలు ఉతకడం వంటి కులవృత్తులపై ఆంక్షలు విధించడం వల్ల వృత్తి కులాల జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఆంక్షలను వ్యతిరేకించిన వారిని గ్రామ బహిష్కరణ చేయడం, మాట్లాడకుండా చేయడం, ఆలయాల్లోకి రాకుండా అడ్డుకోవడం, పాలు నీళ్లు ఇవ్వకుండా ఆదేశించడం వంటి చర్యలు మానవ హక్కుల ఉల్లంఘన అని , మనిషి యొక్క హక్కులకు విరుద్ధమని అన్నారు.

అనంతరం పలు గ్రామాల సమస్యలను వారికి వివరించారు.. వేల్పూరు మండలంలోని రామన్నపేట, జక్రాన్ పల్లి , సావెల్ , ఇందలవాయి మండలంలోని గన్నారం లో అనేక అకృత్యాల పాల్పడుతున్నారని వాపోయారు. నాయి బ్రాహ్మణులు, రజకులు, గొల్ల కురుమలు, గీత కార్మికులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేసి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. అలాగే VDC నిరోధక చట్టం చేసి.. బాధితులకు అండగా నిలబడుతూ.. శిక్షార్హులను వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా కోరరు ఈ కార్యక్రమం లో అడ్వకేట్ ఆంజనేయులు, బాధితులు సుదర్శన్ నర్సాగౌడ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD