Mendora: భర్త దుబాయ్ లో మిస్సింగ్.. ఆచూకీ కోసం ప్రభుత్వాన్ని వేడుకున్న భార్య!

Mendora: నిజామాబాద్ జిల్లా దూదిగాంకు చెందిన శ్రీకాంత్ దుబాయ్‌లో అదృశ్యం. గత 13 రోజులుగా ఆచూకీ లేక ఆందోళన చెందుతున్న భార్య అలేఖ్య, తండ్రి గంగాధర్.

VENU, BALKONDA
Updated on: 28 May 2026 12:31 PM IST
Mendora
X

Mendora: భర్త దుబాయ్ లో మిస్సింగ్.. ఆచూకీ కోసం ప్రభుత్వాన్ని వేడుకున్న భార్య!

నిజామాబాద్ జిల్లా: నా భర్తను ఇండియాకు రప్పించండి రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్న భార్య అలేఖ్య.... మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన తోకల శ్రీకాంత్ అనే వ్యక్తి రూపాయలు 70,000/- లక్ష్మణచందా గ్రామానికి చెందిన రమేష్ అనే ఏజెంట్ కు చెల్లించి ఈ నెల తేదీ 15 రోజున ఇంటి నుండి బయలు దేరి 10 మందితో కలిసి దుబాయ్ దేశానికి వెళ్లిన మరుసటి రోజు ఫోన్ లో మాట్లాడి రేపటి నుండి పనికి వెళ్తాను అని చెప్పి ఇప్పటి వరకు ఫోన్ లేదు. శ్రీకాంత్ తో కలిసి వెళ్లిన మిగత తొమ్మిది మంది పనికి వెళ్తున్నారని ఏజెంట్ రమేష్ తెలిపారు.

మిగత 9 మందితో కలిసి పనికి వెళ్లకుండా గత 13 రోజుల నుండి నా భర్త శ్రీకాంత్ ఫోన్ కంటాక్ట్ లేకుండ ఆచూకీ లేకుండ పోయిందని ఇద్దరు చిన్న పిల్లలు వున్నారని నా భర్త ఎక్కడున్న ఆచూకీ కనుక్కొని ఇండియాకు రప్పించే ప్రయత్నం చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చేతులు జోడించి వేడుకుంటున్న భార్య అలేఖ్య,తండ్రి గంగాధర్.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story